పాము కంటే ప్రమాదకరమైన చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లోరిడా, మెక్సికో, మధ్య అమెరికా, కరేబియన్ బీచ్‌లలో కనిపించే మంచినీల్ అనే చెట్టు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది.
యాపిల్ చెట్టును పోలి ఉండడంతో దీన్ని బీచ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.
ఈ చెట్టు కింద నిలబడితే చనిపోయే ప్రమాదం ఉంటుంది.
ఈ చెట్టు కలప, పండ్లు, ఆకులు ఇలా ప్రతి భాగం విషపూరితమైనది.
పొరపాటున దీని పండ్లను తింటే వెంటనే ప్రాణాలు పోతాయి.
వర్షంలో ఈ చెట్టు కింద నిలబడితే చర్మంపై దుద్దుర్లు, పొక్కుల వస్తాయి.
దీని కలపను ఎండలో ఆరబెట్టిన తర్వాత పర్నీచర్‌కు ఉపయోగిస్తుంటారు.
ఈ చెట్టు కింద వాహనాలు పార్క్ చేసినా కూడా కొన్ని గంటల తర్వాత పాడవుతాయి.
సముద్రం వల్ల నేలపై మట్టి నీళ్లలో కలిసిపోకుండా వీటి వేర్లు నేలను బలంగా ఉంచగలవు.
49 అడుగుల ఎత్తు వరకూ పెరగగలిగే ఈ చెట్లు ఎరుపు, బూడిదరంగు బెరడుతో ఉంటాయి.
అందుకే ఈ చెట్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు.
Related Web Stories
హైబీపీ ఎక్కువ కాలం ఉంటే.. వచ్చే సమస్యలు ఇవే..
దాభా స్టైల్లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలున్నాయా..
మొటిమలు గిల్లుతున్నారా..అయితే జరిగేది ఇదే..!