మధ్య వయసు, వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే 30 ఏళ్లు దాటిన తర్వాత కొన్ని పోషకాలు, విటమిన్లు కచ్చితంగా తీసుకోవాలి.
విటమిన్-D3
విటమిన్-డి3 పాల నుంచి ఎక్కువగా లభిస్తుంది. సూర్య రశ్మి నుంచి మన శరీరానికి అవసరమైన విటమిన్-డి లభిస్తుంది. అలాగే సాల్మన్ చేపల నుంచి కూడా విటమిన్-డి లభిస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం
వయసుతో పాటు బ్రెయిన్ సామర్థ్యం క్షీణించకుండా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం ఎంతో అవసరం. సాల్మన్ చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం పొందవచ్చు.
మెగ్నీషియం
వయసు మళ్లిన తర్వాత కూడా కండరాలను పటిష్టంగా ఉంచాలంటే తగినంత మెగ్నీషియం తీసుకోవాలి. గుమ్మిడి గింజలు, జీడిపప్పు, పిస్తా, ఆరటిపళ్లలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
జింక్
వయసు పెరిగే కొద్దీ హార్మోనల్ సమస్యలు మొదలవుతాయి. వాటిని అరికట్టాలంటే జింక్ తప్పనిసరి. శనగలు, గుమ్మిడి గింజలు, నత్త గుల్లలు, క్యారెట్, బీన్స్, బాదంలలో జింక్ పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ బి
ఆరోగ్యకరమైన శరీరం కోసం విటమిన్ బి ఎంతో అవసరం. తృణ ధాన్యాలు, గుడ్లు, ఆకు కూరలు, కూరగాయల ద్వారా విటమిన్ బి6, బి9, బి12 శరీరానికి అందుతాయి.
40 ఏళ్లు దాటిన తర్వాత పోషకాల లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. ఉంటే సప్లిమెంట్స్ ద్వారా విటమిన్లను తీసుకోవాలి.
30 ఏళ్లు దాటిన తర్వాత క్రమం తప్పకుండా వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి. కండరాలు, ఎముకలు దృఢంగా వ్యాయామం ఎంతో అవసరం.