ఉదయాన్నే కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎండార్ఫిన్లు విడుదలై రోజంతా ఉల్లాసంగా ఉంటారు. అవేంటంటే..

ఉదయం చేసే కసరత్తులతో ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా హుషారుగా ఉంటుంది

ఉదయం లేవగానే నచ్చిన పాట విని పని మొదలెడితే రోజంతా మూడ్ బాగుంటుంది

ఉషోదయ సూర్యకిరణాలు సోకితే మూడ్ మెరుగవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి

చన్నీటి స్నానంతో కూడా ఎండార్ఫిన్లు విడుదలై మనసులో సంతోషకర భావనలు ఆవరిస్తాయి 

ఉదయన్నే సుగంధ ద్రవ్యాల వాసనలు కూడా ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపించి ఒత్తిడిని తగ్గిస్తాయి

మనసుకు నచ్చిన వారితో గడపడం, తనివితీరా నవ్వడం కూడా మనసుకు ఉల్లాసానిస్తుంది.