ప్రపంచంలో అత్యంత ఖరీదైన పువ్వులు ఇవే..

పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. కొన్ని రకాల పువ్వులు ఎంతగానో ఆకర్షిస్తాయి.

కొన్ని పువ్వులు ధర అధికంగా ఉంటాయి. దీంతో వాటిని విలువైన పువ్వులుగా చూస్తారు. ప్రపంచంలో ఖరీదైన పువ్వుల గురించి తెలుసుకుందాం.

కుంకుమపువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైనది.  ఈ జాతి మొక్కనుంచి కుంకుమపువ్వు తయారవుతుంది.

గోల్డ్ ఆఫ్ కినాబాలు.. ఈ రకం పువ్వులు మలేషియాలో మాత్రమే లభిస్తాయి. ఎంతో విలాసవంతమైన పువ్వు.. అద్భుతమైన రూపాన్ని కలిగి ఉంటుంది. దీని ధర ఇతర పువ్వులతో పోలిస్తే అధికంగా ఉంటుంది.

షెన్‌జెన్ నాంగ్కే ఆర్చిడ్.. ఎంతో అందంగా కనిపించే ఈ పువ్వులు అరుదుగా కనిపిస్తాయి. అత్యంత ఖరీదైన పువ్వులో ఇదొకటి.

కడుపుల్ ఫ్లవర్స్ రాత్రి పూట మాత్రమే వికసిస్తాయి. తెల్లవారుజామున వాడిపోతాయి. ఈ పువ్వులు ఎంతో అరుదైనవి. వీటి జీవితకాలం ఎంతో తక్కువ.

బ్లాక్ ఆర్చిడ్ పువ్వు అరుదైన జాతుల్లో ఒకటి. ఈ పువ్వులు ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి.

కొన్ని పువ్వులు అందంగా ఉండటంతో పాటు అరుదుగా లభిస్తాయి. దీంతో ఇవి అధిక ధర పలుకుతాయి.

ఖరీదైన పూల మొక్కలు కేవలం దేశ, విదేశాల్లో ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కనిపిస్తాయి.