d5e2794c-f214-484b-b509-8da8b3f1bd47-marriage.jpg

పెళ్లి తరువాత మగాళ్లు చేస్తున్న తప్పులివే..!

3cfdfb19-e36c-4361-8766-9b7af7b5ce4a-marriage11.jpg

పెళ్లి ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని చాలా మారుస్తుంది.  

f27153d9-c0e9-4b78-91e6-3856d785f593-marriage2.jpg

పెళ్లి తరువాత మగాళ్లు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. ఇవి భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తాయి.

bb356c0b-263d-4dfb-bf3c-d27ad9ef4e00-marriage3.jpg

మగాళ్లు తాము చేసిన తప్పులను ఒప్పుకోవడానికి అంగీకరించరు.  తాము చేసిన తప్పులకు కూడా తమ భాగస్వాములనే నిందిస్తారు.  ఇది భార్యాభర్తల బంధాన్ని దెబ్బతీస్తుంది.

పెళ్లి తరువాత అబ్బాయిలు తమ కోరికలు అణిచివేసుకుంటారు.  ఇది వారి జీవితం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

అబ్బాయిలు పెళ్లి తరువాత  తమ భాగస్వామితో ఏ విషయాన్ని షేర్ చేసుకోరు.  భాగస్వామిని అనుమానిస్తారు. ఇది బంధానికి విషంలా పనిచేస్తుంది.

ఎప్పుడూ పనులలో బిజీగా ఉంటూ భాగస్వామిని పట్టించుకోకపోవడం చాలాతప్పు. దీని వల్ల భార్యాభర్తల మద్య బంధం బలహీనంగా ఉంటుంది.

భార్యతో చెప్పకుండా అనవసరంగా ఖర్చు చేయడం చాలా మంది మగాళ్లు చేసే తప్పు.

మగాళ్లు తమ ఎమోషన్స్ ను బయటకు వ్యక్తం చేయరు. ఇలా చేయడం వల్ల అది బంధం మీద, భాగస్వామి మీద కోపం అసహనం రూపంలో బయటపడుతుంది.

భార్యాభర్తలు కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి. కానీ ఒక్కొక్కరు ఒకో విధంగా ఉంటే ఇద్దరి మద్య చెడుతుంది.

జీవితంలో ఎవరూ పర్పెక్ట్ కాదు.  కానీ అబ్బాయిలు చాలా వరకు తమ భార్యలు పర్పెక్ట్ గా ఉండాలని అనుకుంటారు. ఆ వైపు తమ భార్యలను ఒత్తిడి చేస్తారు.

పెళ్లి తర్వాత కుటుంబానికి,  భాగస్వామికి సమ ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలామంది మగాళ్లు చేసే పని. ఇది చాలా తప్పు.