నోరూరించే టేస్టీ బనానా కేక్ ఇలా ఈజీగా..

బనానా కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు: అరటి పండ్లు, గుడ్లు, పంచదార, అన్ సాల్టెడ్ బటర్, మైదా, బేకింగ్ సోడా, ఉప్పు, వెనీలా ఎసెన్స్.

ముందుగా అరటి పండ్లను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. 

 రైస్ కుక్కర్‌కి కొద్దిగా బటర్ లేదా ఆయిల్ అప్లై చేయండి. దానిమీద పిండితో కోటింగ్ వేసుకోవాలి

ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్ల తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. ఇది బాగా గిలకొట్టాలి. 

 పంచదార వేసి మళ్లీ బాగా బీట్ చేసుకోవాలి

ఇప్పుడు పచ్చ సొన, అరటి పండు గుజ్జు, వెనీలా ఎసెన్స్, బటర్.. ఇలా ఒక దాని తర్వాత మరొకటి అన్నీ వేసుకుంటూ కలుపుకోవాలి

 ఈ మిశ్రమాన్ని రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కుక్ బటన్ స్టార్ట్ చేయాలి. కేక్ అయిపోగానే వార్మ్ మోడ్‌లోకి వచ్చేలా సెట్ చేసుకోవాలి

 కేక్ అయిపోయాక కొబ్బరి పొడి, బనానా ముక్కలు, చాకో చిప్స్‌తో డెకరేషన్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది.