ముఖేష్ అంబానీ ఆస్తుల వివరాలు తెలుసా? 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారత్‌లోనే అత్యంత ధనవంతుడు. 2023 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచ కుబేరుల్లో 12వ స్థానంలో ఉన్నారు. 

ఇటీవల గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్స్ కోసం ముఖేష్ అంబానీ వంద కోట్లకు పైనే ఖర్చుపెట్టారు. 

ముఖేష్, ఆయన కుటుంబం అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతారు. ముంబైలో ఉన్న అంటీలియా హౌస్ ఖరీదు రూ.15 వేల కోట్లు. ప్రపంచంలోనే ఇది రెండో అత్యంత ఖరీదైన భవనం. 

కొన్ని రోజుల క్రితం మాన్ హట్టన్‌లోని వెస్ట్ విలేజ్ అపార్ట్‌మెంట్‌ను ముఖేష్ అమ్మేశారు. అయినప్పటికీ ముఖేష్ విదేశాల్లో ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నారు.

న్యూయార్క్‌లోని విలాసవంతమైన మాండరిన్ ఓరియెంటల్ హోట‌ల్‌ను ముఖేష్ కొనుగోలు చేశారు. రూ.850 కోట్ల విలువైన ఈ హోటల్‌లో 248 గదులు ఉంటాయి. 

లండన్‌లో 900 సంవత్సరాల పురాతన స్టోక్ పార్క్స్ భవనాన్ని ముఖేష్ కొన్నారు. రూ.529 కోట్ల విలువైన ఈ భవనం వింటేజ్ లుక్‌తో ఉంటుంది. 

దుబాయ్‌లోని ఓ ఖరీదైన మాన్షన్‌ను రూ.639 కోట్లకు ముఖేష్ కొనుగోలు చేశారు. దుబాయ్‌లోనే ఇది అత్యంత ఖరీదైన డీల్

ఇక భారత్‌లోని ముంబై, గుజరాత్ వంటి ప్రాంతాల్లో ముఖేష్ అంబానీ కుటుంబానికి ఖరీదైన ఆస్తులున్నాయి.