దీపావళి నాడు కచ్చితంగా ట్రై చేయాల్సిన గ్లూటెన్ రహిత స్నాక్స్‌ రాగి చిక్కీలు!

రాగి పిండి, వాముతో చేసే దీని రుచి వర్ణించేందుకు మాటలు చాలవు

దీని తయారీకి ఒక కప్పు రాగి పిండి, నెయ్యి, వాము, ఉప్పు తగినంత కావాలి

ముందుగా రాగి పిండికి నీళ్లు కలిపి దానికి వాము, ఉప్పు, నెయ్యి జతచేయాలి.

ఈ మిశ్రమానికి మరిన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. అరగంట పాటు నాననివ్వాలి

ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి గుండ్రటి బిస్కెట్ల రూపంలో ఒత్తుకోవాలి

మూకుడులో నూనె పోసి మరిగాక వీటిని అందులో వేయించాలి

చిక్కీలు ముదురు గోధుమ రంగులోకి వచ్చేలా వేయించి దాచుకోవాలి.

సాయంత్రాలు టీలో నంచుకుని తినేందుకు అనువైన చిరుతిండిగా ఇది ఉపయోగపడుతుంది.