వేపాకు మంచిదే కానీ..  ఇలా తింటే మాత్రం ప్రమాదం!

ఆయుర్వేదం ప్రకారం వేపాకు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. అయితే దానిని సరైన విధానంలో తీసుకోకపోయినా, అతిగా తీసుకున్నా ఇబ్బందులు తప్పవు.

యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్, యాంటీ-సెప్టిక్ లక్షణాలు కలిగిన వేపాకుతో కొన్ని సైడ్-ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

షుగర్ వ్యాధిగ్రస్తులకు వేపాకు మంచి చేస్తుంది. అయితే అతిగా వేపాకు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయి కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదముంది

వేపాకు చర్మ సంరక్షణకు దివ్యౌషధం లాంటిది. అయితే కొందరిలో అది అలెర్జీలకు కూడా కారణమవుతుంది. మీ చర్మానికి పడుతుందో లేదో చూసుకున్నాకే దానిని వాడాలి.

వేపాకు వినియోగం అధికమైతే ఉదర సంబంధ సమస్యలు మొదలవుతాయి. కడుపునొప్పి, వాంతులు, వికారం ప్రారంభమవుతాయి.

రక్తపోటు బాధితులు వేపాకుకు దూరంగా ఉండడమే మంచిది. వేపాకు తీసుకోవడం వల్ల రక్తపోటు అనూహ్యంగా పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది.

వేపాకును అధికంగా తింటే కిడ్నీ సంబంధ సమస్యలు మొదలవుతాయి.

వేపాకును అధికంగా తీసుకోవడం వల్ల తలనొప్పి, ఆందోళనగా ఉండడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.