2024 నోబెల్ ఫిజిక్స్ ఇద్ద‌రికి ద‌క్కింది

రాయ‌ల్ స్విడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ పేర్ల‌ను  ప్ర‌క‌టించింది

జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్రీ హింటన్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది

కృత్రిమ న్యూరో నెట్‌వ‌ర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్‌కు వ్య‌వ‌స్థీకృత ఆవిష్క‌ర‌ణ‌లు చేసారు

స‌మాచారాన్ని స్టోర్ చేసి, రీ క‌న్‌స్ట్ర‌క్ట్ చేసే విధానాన్ని జాన్ హోప్‌ఫీల్డ్ సృష్టించారు

డేటాలో ఉన్న వివిధ ప్రాప‌ర్టీల గురించి జెఫ్రీ హింట‌న్ ఓ విధానాన్ని డెవ‌ల‌ప్ చేశారు

దాని ద్వారా ప్ర‌స్తుతం ఉన్న కృత్రిమ న్యూర‌ల్ నెట్వ‌ర్క్‌ను అమ‌లు చేయ‌వ‌చ్చు

అవార్డు విజేతలు  ₹ 8.3 కోట్లు కాష్ ప్రైజ్ అందుకోనున్నారు

గ‌త ఏడాది ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం ద‌క్కింది

శాస్త్ర‌వేత్త‌లు అన్నే ఎల్ హుయిలైర్‌, పీరీ అగోస్టిని, క్రాజ్‌లు అవార్డు అందుకున్నారు