వసంత పంచమిరోజున ఏ దేవతలను ఆరాధిస్తారు..?
ఈ రోజున ప్రత్యేకంగా సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈరోజును వసంతపంచమి లేదా శ్రీ పంచమి అని సరస్వతీ పూజ అని కూడా పిలుస్తారు.
ఈ పండుగ రోజున సరస్వతీ దేవిని పసుపు పూలతో పూజిస్తే జ్ఞానం, కాంతి, శక్తి, శ్రేయస్సును ఇస్తుంది.
వసంత పంచమిని సరస్వతీ దేవి జన్మదినంగా భావిస్తారు.
ఈ రోజున ప్రత్యేకంగా జ్ఞానం, ఆధ్యాత్మిక కాంతికి చిహ్నంగా సూర్యుడిని కూడా పూజిస్తారు.
మరి కొందరు ఈ రోజున శివ పార్వతులకు మామిడి పువ్వులు, గోధుమలు సమర్పించుకుంటారు.
దేవతలకు అధినాయకుడైన గణపతిని కూడా వసంత పంచమి రోజున ప్రత్యేకంగా ఆరాధిస్తారు.
వసంత పంచమి ఘడియలు 14 బుధవారం ఉదయం 7:11 గంటల నుంచి 12:35 వరకూ ఉంటున్నాయి.
ఈ రోజు సరస్వతీ పూజకు భక్తులు పసుపు బట్టలు ధరిస్తారు.