ఎనిమిదవ రోజు
వెన్నముద్దల బతుకమ్మ
తెలంగాణలో పూల పండుగ
ఎనిమిదవ రోజుకు చేరుకుంది
బతుకమ్మ పండుగను రాష్ట్రంలో
ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి
నుంచి తొమ్మిది రోజుల
పాటు జరుపుకుంటారు
మొదటి రోజు ఎంగిలిపూల
బతుకమ్మతో మొదలైన సంబురాలు
సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి
ఈరోజు బతుకమ్మను
వెన్నెముద్దల బతుకమ్మగా
తెలంగాణ ఆడపడుచులు
పిలుస్తారు
గులాబీ, చేమంతి, తంగేడు,
గునుగు, గడ్డి పూలతో
బతుమ్మను పేరుస్తారు
వెన్నతో చేసిన పదార్థాలను
నివేదిస్తారు కాబట్టి ‘వెన్నముద్దల
బతుకమ్మ’ అంటారు
ఈరోజు నైవేద్యంగా నువ్వులు,
బెల్లం, వెన్న లేదా నెయ్యి
కలిపిన పదార్థాలు గౌరమ్మకు
సమర్పిస్తారు
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
తరువాత నుంచి ఒక్కో రోజు
ఒక్కో వరుసను పెంచుకుంటూ
బతుకమ్మను పేరుస్తారు
తెలంగాణ ఆడపడుచులు
ఈరోజు ఎనిమిది వరుసలతో
బతుకమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో పేరుస్తారు
పసుపుతో గౌరమ్మను తయారు
చేసి బతుకమ్మ వద్ద ఉంచుతారు
ఆపై ఇంటి ముందర వేసిన పెద్ద
పెద్ద ముగ్గుల మధ్యలో బతుకమ్మను
పెట్టి.. చుట్టుపక్కల ఆడవాళ్లతో
కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ
చుట్టూ తిరుగుతారు మహిళలు
బతుకమ్మ పాటలు పాడిన
తర్వాత అంతా కలిసి చెరువులో
కానీ, నదిలో కానీ బతుకమ్మను
నిమజ్జనం చేస్తారు
Related Web Stories
అటాక్ చేస్తే ప్రతీకారం తీర్చుకునే జంతువులు ఇవే!
బెంబేలెత్తిస్తున్న డెంగీ...
ఈ 10 పాములు కాటేసినా ఏమీ కాదని మీకు తెలుసా..
భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..