నాలుగో రోజు నానే బియ్యం  బతుకమ్మ.. నైవేద్యం ఇదే

 తెలంగాణలో బతుకమ్మ  వేడుకలు నాలుగో రోజుకు  చేరుకున్నాయి

 ప్రతీ రోజు సాయంత్రం మహిళలు బతుకమ్మలను పేరుస్తూ  ఆడిపాడి ఎంతో ఉత్సాహంగా  పండుగను జరుపుకుంటున్నారు

 పండుగలో భాగంగా నాలుగో  రోజు నానే బియ్యం  బతుకమ్మను పేర్చుతారు

ఆశ్వయుజ శుద్ధ తదియనాడు  నానే బియ్యం బతుకమ్మను  జరుపుకుంటారు 

నానే బియ్యం బతుకమ్మ  రోజున నాలుగు వరుసలతో  బతుకమ్మను త్రికోణంలో పేర్చుతారు

తంగేడు పువ్వు, గునుగు  పువ్వుతో పాటు వివిధ  రకాల పూలతో బతుకమ్మను  తయారుచేస్తారు

ఈరోజు నానబోసిన బియ్యాన్ని  ప్రధానంగా నివేదిస్తారు  కాబట్టి నానే బియ్యం  బతుకమ్మ అనే పేరు వచ్చింది

అలాగే పసుపుతో గౌరమ్మ  తయారు చేసి బతుకమ్మపై  ఉంచుతారు

ఈరోజు నానవేసిన బియ్యం,  పాలు, బెల్లం కలిపిన వంటకాలు  నైవేద్యంగా సమర్పిస్తారు

బతుకమ్మ సిద్ధమైన తరువాత  వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు  వేసి అందులో బతుకమ్మతో  పాటు నైవేద్యాన్ని ఉంచుతారు

చుట్టుపక్కల మహిళలతో కలిసి  బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా  చప్పట్లు కొడుతూ ఆడుతూ  బతుకమ్మ పాటలు పాడతారు

ఆపై చిన్నారులతో పాటు  పెద్దలు కూడా నానె బియ్యం  నైవేద్యాన్ని పంచుతారు

తరువాత బతుకమ్మకు నీటిలో  నిమజ్జనం చేయడంతో నాలుగో రోజు బతుకమ్మ సంబరాలు పూర్తి అవుతాయి