రాత్రి పూట పాలతో వీటిని తీసుకోండి..  మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.. 

రాత్రి వేళల్లో పాలతో  కలిపి ఓట్స్ తీసుకోండి. కాల్షియం, ఫైబర్ కలిసి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రశాంతమైన నిద్రకే కాకుండా జీర్ణ శక్తికి, ఎముకల పుష్టికి ఉపయోగపడతాయి. 

పాలు, అరటిపండు కలిపి తీసుకుంటే మెగ్నీషియం, పొటాషియం మీ శరీరానికి అందుతాయి. కండరాలను రిలాక్స్ చేసి మంచి నిద్రకు తోడ్పడతాయి. 

రాత్రి నిద్రకు ముందు పాలల్లో కాసింత అల్లం, కొంచెం పసుపు వేసుకుని తాగితే పలు ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు దరి చేరకుండా ఉంటాయి. 

రాత్రి నిద్రపోయే ముందు వేడి పాలల్లో కాస్తంత తేనె కలుపుకుని తాగితే మీ జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. చక్కగా నిద్ర పడుతుంది.

పాలతో తృణ ధాన్యాలను కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. 

ఒక స్పూన్ పీ-నట్ బటర్‌ను పాలతో  కలిపి తీసుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వులు మీ శరీరానికి అందుతాయి. ప్రోటీన్ బూస్ట్‌లా కూడా పని చేస్తుంది. 

పాలతో కలిపి చియా సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. తగినంత ఫైబర్, ప్రోటీన్లు కూడా శరీరంలోకి  చేరుతాయి. 

పాలతో కలిపి యోగర్ట్‌ను తీసుకుంటే చక్కని ప్రోటీన్లు, ప్రో బయోటిక్స్ అందుతాయి. గట్ హెల్త్‌కు, జీర్ణ క్రియకు సహాయపడతాయి.