నువ్వు మీ నాన్నలానో, అమ్మలానో ప్రవర్తిస్తావు. అని పిల్లలతో అనడం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే పోలిక మంచిగానే ఉన్నాకూడా అది మీ పిల్లలను ప్రభావితం చేస్తుంది.
చాలా విసిగిస్తావు. అంటూ పిల్లల తీరుపై ముద్ర వేయొద్దు.
వారి ప్రవర్తన గురించి పాజిటివ్‌గా అన్నా, నెగటివ్‌గా అన్నా అది పిల్లల మనసులో బలంగా నాటుకుంటుంది.
మీ నాన్న లేదా అమ్మ వెళ్లాక నీ పని చెబుతా... అనే మాట పిల్లలను మందలించేందుకు అంటారు.
ఆ పని చేసినందుకు థ్యాంక్యూ ప్రతిసారి నువ్వెందుకు కుదురుగా ఉండవుఅనడం సరికాదు.
తల్లితండ్రులు పిల్లలను ఒక పని బాగా చేశావని మెచ్చుకోవడం, మరో పని సరిగా చేయలేదని తిట్టడం వల్ల మంచిది కాదు. ఆ మాటలను పిల్లలు అవమానంగా భావిస్తారు.
నాకు చికాకు తెప్పిస్తున్నావు అంటూ తమ పరిస్థితికి పిల్లలను బాధ్యులు చేయొద్దు.
‘నాతో వాదించకు’ అంటూ పిల్లలను హెచ్చరించడం వారిని క్రమశిక్షణలో పెట్టేందుకు ఏ విధంగానూ తోడ్పడదు.
పిల్లలను దారిలో పెట్టేందుకు ప్రేమగా మందలించాలి. ఒకటికి రెండుసార్లు చెప్పి చూడాలి.