e998383e-5634-4afc-b868-2e1ff1cfa34b-res.jpg

పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!

e5feca7d-7f6f-481d-9ab7-f4d411236407-res1.jpg

చిన్నతనం నుండే తమ పిల్లలు బాధ్యతగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. తల్లిదండ్రులు కొన్ని పనులు చేయడం ద్వారా పిల్లలు బాధ్యతాయుతంగా తయారవుతారు.

8b6634ea-4204-415d-bee1-cbbe33a9c769-res2.jpg

తల్లిదండ్రులు పనులు చేస్తూ పిల్లలను కూడా ఇంటిపనుల్లో భాగం చేసుకోవాలి. దీనివల్ల వాళ్లకు పనులు అలవాటు అవుతాయి.

a1b2f57c-c8ee-4f8a-9a9e-bd6c95d2e46d-res3.jpg

పిల్లలకు వారి వయసును బట్టి చిన్నచిన్న బాధ్యతలు అప్పజెప్పాలి.

పిల్లలు ఏవైనా  తప్పులు చేస్తారనే భయంతో  వారిని పనులు చేసేటప్పుడు అడ్డు పడకూడదు. తప్పుల నుండి పిల్లలు చాలా నేర్చుకుంటారు.

పిల్లల మీద నమ్మకం ఉంచి వారికి పనులు అప్పజెబితే చాలా బాధ్యతగా చేస్తారు.

పిల్లలు ఏ పని కరెక్ట్ గా చేసినా వారిని మెచ్చుకోవాలి. ఇలా చేస్తే వారికి ఉత్సాహం ఉంటుంది.

పిల్లలతో స్నేహితుల్లా మాట్లాడాలి.  పాజిటివ్ ఆలోచనలను పిల్లలలో నింపాలి.

పిల్లలు బాధ్యతగా ఉండటం లేదని కోపం చేసుకోవడం, తిట్టడం చెయ్యకూడదు. వారు బాధ్యతగా మారడానికి సమయం పడుతుంది.

అన్నింటి కంటే ముఖ్యంగా పిల్లలకు క్రమ శిక్షణ నేర్పాలి. క్రమ శిక్షణ పిల్లలను బాధ్యతగా మారుస్తుంది.