స్కూలు నుంచి తిరిగొచ్చాక పిల్లల్ని అడగాల్సిన ప్రశ్నలివి
స్కూల్ సమయంలో ఆడుకోవడానికి సమయం ఇచ్చారా లేదా అడగాలి. ఆటలంటే పిల్లలకు ఇష్టం. ఉత్సాహంగా సమాధానం చెబుతారు.
పాఠశాలలో కష్టంగా చేసిన పనేంటి? అని అడగాలి. ఇలా అడిగితే పిల్లలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది.
పిల్లలు స్కూల్లో ఏ పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. దీనివల్ల పిల్లల అభిరుచి, ఆసక్తి తెలుస్తుంది.
స్కూల్లో జరిగిన ఫన్నీ సంఘటన గురించి అడగాలి. పిల్లలు వాటిని కథలుగా చెప్పడానికి భలే ఇష్టపడతారు.
పిల్లలు ఏ యాక్టివిటీస్ పట్ల ఉత్సాహంగా ఉన్నారో తెలుసుకోవాలి. అవి వారి భవిష్యత్తును నిర్దేశించవచ్చు.
స్కూల్లో ఏదైనా మంచి పని చేశావా? అని అడగాలి. తద్వారా పిల్లలు మంచి నడవడిక వైపు వెళతారు.
ఏ విషయంలో అయినా స్కూల్లో మెచ్చుకున్నారా? అని అడగాలి. పిల్లలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసం పెంపొందే అవకాశం ఉంటుంది.
ఎవరికైనా థాంక్స్ చెప్పావా? అని అడగాలి. ఇది ఆనందం, కృతజ్ఞత రెండూ ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటాయని తెలుపుతుంది.
ఈరోజు లంచ్ నచ్చిందా? అని అడగాలి. తద్వారా పిల్లలకు ఇష్టమైన ఆహారం గురించి ఈజీగా తెలిసిపోతుంది.