తల్లిదండ్రులు తమ పిల్లల గురించి టీచర్లను తప్పక అడగాల్సిన ప్రశ్నలివి..!
పాఠశాల వయసు వచ్చాక పిల్లలు స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. చాలా విషయాలు అక్కడే నేర్చుకుంటారు.
తల్లిదండ్రులు టీచర్లను తప్పకుండా కొన్ని ప్రశ్నలు అడగాలి. దీనివల్ల పిల్లల బలాలు, బలహీనతలు, వారి మనస్తత్వం అన్నీ అర్థమవుతాయి.
పిల్లాడు తరగతి గదిలో ఎలా ఫీలవుతున్నాడు? తరగతి గది వాతావరణానికి ఎలా అలవాటు పడుతున్నాడో తెలుసుకోవాలి. పిల్లలలో సర్దుబాటు మనస్తత్వాన్ని తెలుపుతుందిది.
పిల్లలు తోటి పిల్లలతో కలవడం పట్ల ఆసక్తిగా ఉన్నారా లేదా అడగాలి. ఇది పిల్లలలో కలుపుగోలు తనాన్ని తెలుపుతుంది.
తరగతిలో పిల్లలు మానసికంగా ఎలా ఉన్నారో అడగాలి. కోపంగా, దురుసుగా మాట్లాడటం. తోటి విద్యార్థులను కొట్టడం లాంటివి చేస్తారేమో తెలుసుకోవాలి. పిల్లలలో నియంత్రించాల్సిన విషయాలు అర్థమవుతాయి.
తరగతిలో పిల్లాడు ఆసక్తిగా పాఠాలు వినడానికి ఇష్టపడుతున్నాడా అని అడగాలి. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి ఎంతో తెలుపుతుంది ఇది.
పిల్లలకు ఇష్టమైన సబ్డెక్ట్ ఏమిటో అడిగి తెలుసుకోవాలి. దాన్ని బట్టి వారిని ప్రోత్సహించడం, ఇతర సబ్జెక్ట్స్ నచ్చాలంటే ఏం చెయ్యాలో అర్థమవుతుంది.
పిల్లలలో మెరుగుదల ఉందా లేదా అడిగి తెలుసుకోవాలి. తరగతిలో ప్రశ్నలు, సమాధానాల విషయంలో చురుగ్గా ఉన్నారా, తెలివిగా ఆలోచిస్తున్నారా అడిగి తెలుసుకోవాలి.