తల్లిదండ్రులు ఈ 9పనులు చేస్తే చాలు.. పిల్లలలో కొండంత ఆత్మవిశ్వాసం నిండుకుంటుంది..!
తల్లిదండ్రులకు పిల్లలమీద నమ్మకం ఉండటం ముఖ్యం. తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఆలోచన పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
ఓడిపోవడం ఎప్పుడూ ముగింపు కాదని పిల్లలకు చెప్పాలి. ఓటమి నుండి అనుభవాలు నేర్చుకుని విజయం సాధించేవరకు ప్రయత్నం చెయ్యమని ప్రోత్సహించాలి.
ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తీ చేసేవరకు వదలొద్దని చెప్పాలి. పిల్లలో సంకల్ప బలం పెరుగుతుంది.
విజయం సాధించాలంటే శ్రద్ద, ఏకాగ్రత చాలా అవసరం. ఏ పని చేసినా పూర్తీ మనసు పెట్టి చెస్తే వందశాతం ఫలితం వస్తుందని చెప్పాలి.
ఓటమి తర్వాత మళ్లీ ప్రయత్నం చేయడం, గెలిచిన తరువాత దాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో చెప్పాలి. గెలుపోటముల విలువ అర్థమవుతుంది.
సెల్ప్ రెస్పెక్ట్, సెల్ప్ కేర్ గురించి పిల్లలకు వివరించాలి. ఇతరును గౌరవించడం ద్వారా తమకూ గౌరవం దక్కుతుందని తెలుసుకుంటారు.
అవసరం అయితే తప్ప ఇతరుల సహాయం తీసుకోరాదని పిల్లలకు చెప్పాలి. సొంతంగా చేయకపోతే ఎప్పటికీ నేర్చుకోలేరు.
పాజిటివ్ గా ఉంటే ఏ పనిని అయినా సులువుగా చేయగలరని పిల్లలకు చెప్పాలి. చిన్నతనం నుండే ఇది అలవాటు చేస్తే ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
కృతజ్ఞత, క్షమాపణ, రిక్వెస్ట్ చేయడం వంటివి పిల్లలకు నేర్పాలి. ఇవి లేకపోతే పిల్లలు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నా దాన్నిపొగరు కింద లెక్కగడతారు.