పిల్లలలో కాన్ఫిడెంట్ పెరగాలంటే.. తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులు ఇవీ..
పిల్లలలో కాన్పిడెంట్ మెరుగ్గా ఉంటే వారు బాల్య దశ నుండే ఉన్నత లక్ష్యాల వైపు వెళ్లగలుగుతారు.
పిల్లలలో కాన్పిడెంట్ మెరుగ్గా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని పనులు చేయాలి.
పిల్లలు సాధించే చిన్న విజయాలను కూడా గుర్తించి వాటిని సెలబ్రేట్ చేస్తుంటే పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పిల్లలు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు వారిని అడ్డుకోకూడదు. వారి సామర్థ్యం, వారి మీద వారికి నమ్మకం వారికి స్వేచ్ఛను ఇచ్చినప్పుడే అర్థమవుతాయి.
పిల్లలు సాధించిన విజయాలు, మార్కులు, ర్యాంకుల గురించే కాదు.. పిల్లలు ఎంత కష్టపడుతున్నారనే విషయాన్ని గుర్తించాలి. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
చదువులోనూ, ప్రవర్తనలోనూ, ఇతర నైపుణ్యాలలోనూ పిల్లలను ఇతరులతో పోల్చకూడదు.
ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం ఏర్పడినా తల్లిదండ్రులు తమకు తోడు ఉంటారనే ధైర్యాన్ని పిల్లలలో కల్పించాలి. ఇది పిల్లలను కొత్త లక్ష్యాల వైపు నడిపిస్తుంది.
పిల్లలు తప్పు చేస్తారేమో.. ఓటమి పాలవుతారేమో అని భయపడకూడదు. వారు తప్పుల నుండి నేర్చుకుని ముందుకు వెళ్లగలరు.
పిల్లలు సామాజికంగా యాక్టీవ్ గా ఉండేలా చూడాలి. స్నేహితులు, ఆటలు, పోటీలు, ఇతర నైపుణ్యాలు ప్రోత్సహించడం వంటివి చేస్తే వారి కాన్పిడెంట్ పెరుగుతుంది.
తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసంతో ఉంటే పిల్లలు కూడా దాన్ని అలవాటు చేసుకుంటారు.