పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఈ పనులు తప్పక చెయ్యాలి.

టివి, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వంటివి పిల్లలను ఎక్కువగా పాడుచేస్తాయి. వాటిని దూరం పెట్టాలంటే తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి.

కథలు చెప్పడం, పిల్లల చేత కథలు చెప్పించడం, వాకింగ్ కు, పార్కుకు తీసుకెళ్లడం చేస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధం బలంగా ఉంటుంది.

పిల్లలను చిన్న చిన్న టూర్లకు తీసుకెళ్లాలి, వారి అల్లరిని సంతోషాన్ని అడ్డుకోకూడదు. ప్రతి విషయానికి వారిని నిందించకూడదు.

పిల్లల భావోద్వేగాలు చిన్నవే అయినా ఆ చిన్ని మనసులకు అవే భారం. వారిని ఓదార్చాలి. ఏడవకూడదని, కోప్పడకూడదని, నవ్వకూడదని వారని కంట్రోల్ చేయకూడదు. ఇలా చేస్తే మానసికంగా ఎదగలేరు.

పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు పూర్తీగా వినాలి. ఆ తరువాత ఆ విషయాన్ని వారితో చర్చించాలి. ఇలా చేస్తే తల్లిదండ్రులంటే తమ స్నేహితులనే భావన పిల్లలలో కలుగుతుంది

పిల్లలకు ఏదైనా మాట్లాడే స్వేచ్చ ఇస్తే వారు తల్లిదండ్రుల దగ్గర దాపరికం అనే విషయానికి దూరంగా ఉంటారు.

చిన్న మెప్పు కూడా పిల్లలకు సంతోషాన్నిస్తుంది. వారు చేసే చిన్న పనులను మెచ్చుకోవాలి.  అప్పుడప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తుండాలి. ఇలా చేస్తే పిల్లలు పనుల విషయంలో బాద్యతగా ఉంటారు.

పిల్లలను ఎప్పుడూ ఇతరులతో పోల్చకూడదు. చదువు నుండి వ్యక్తిత్వం వరకు ఎవరూ ఎవరికీ పోలిక కాదు. అర్థమయ్యేలా విషయాలను చెప్పి మార్చుకోవాలే తప్ప పోల్చి తిట్టకూడదు.