పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఈ పనులు చేస్తే మాయం!
అన్నం తినడం నుండి రాత్రి నిద్రపోయే వరకు పిల్లలకు ఫోన్ లేనిది గడవదు. ఫోన్ ఇవ్వకుంటే మొండి చేస్తారు, అరుస్తారు, ఏడుస్తారు.
మొబైల్ ఫోన్ వ్యసనం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ అలవాటు మాన్పించడానికి కొన్ని టిప్స్ ఫాలో కావాలి.
పిల్లలను ఫోన్ కు దూరం చెయ్యాలంటే వారిని అవుట్ డోర్ గేమ్స్ వైపు ప్రోత్సహించాలి. ఇది పిల్లల శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది.
తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయించాలి. పిల్లలతో కబుర్లు, కథలు, వింతలు, విశేషాలు చెప్పాలి. వారిని అలా బయటకు తీసుకెళ్లాలి.
పిల్లలకు ఏకాగ్రత ఎక్కువ. చిన్నపిల్లలు అయినా వారు చేయదగిన పనులు పిల్లలకు అప్పగించాలి. చిన్నతనం నుండే పనిచేయడం అలవడుతుంది.
ఫోన్లు కాకుండా కథల పుస్తకాలు, బొమ్మలు వేయడం, రంగులు నింపడం, పజిల్స్ సాల్వ్ చేయమని ప్రోత్సహించాలి. తెలివితేటలు కూడా పెరుగుతాయి.
పిల్లలు ఫోన్ కావాలని అల్లరి చేస్తే వారిని తిట్టడం, కోపగించుకోవడం చేయకుండా ప్రేమగా వివరించాలి.
పిల్లలు రోజులో ఎంతసేపు మొబైల్ చూడాలో టైం సెట్ చేయాలి. ఆ తరువాత వారికి ఫోన్ ఇవ్వమని కరాఖండిగా చెప్పాలి.