1133e320-e327-408a-8885-ebca78fc1d42-ki.jpg

పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!

b3d34830-8794-4a03-b993-ea1cb75262b8-kid.jpg

పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే దానికి తల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవసరం.

79f7b7a3-4b4d-46f5-a5ed-f303af6062a0-kid1.jpg

పిల్లలు తప్పు చేస్తే తిట్టకూడదు. తప్పు వల్ల ఏర్పడే నష్టాలు, ఇబ్బందులు వివరించి చెప్పాలి. కుదిరితే ఉదాహరణ చూపించాలి.  ఏ పని చేయ్యాలన్నా  ఆలోచించి చేస్తారు.

7a43434e-7ef4-4308-8dea-6e6b16514a2d-kid2.jpg

పేరెంట్స్ ఎప్పుడూ రోల్ మోడల్స్ లా ఉండాలి. ఇంటి పని, వృత్తి, కుటుంబం, సమాజం విషయాల్లో తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటే పిల్లలు అంతే బాధ్యతగా తయారవుతారు.

21fed626-57df-41c2-80d0-4de582166dbc-kid5.jpg

 పిల్లలకు తల్లిదండ్రులతో మాట్లాడే స్వేచ్చ  ఇస్తే వారు తల్లిదండ్రులను స్నేహితుల్లా ఫీలవుతారు.

47ec4bb7-f4e0-4766-802f-566f1b31ee16-kid6.jpg

పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే  విసుక్కోకూడదు. తరువాత చెబుతానని చెప్పి,  దాని గురించి కనుక్కుని వారి సందేహం తీరిస్తే పిల్లలు తృప్తి పడతారు. 

4c1db90a-bd9f-4440-b463-04f9c37acfd5-kid7.jpg

పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే పిల్లలకు చిన్నచిన్న టాస్కులు ఇవ్వాలి. నైపుణ్యాలను కూడా పెంచుతాయవి.

14b56917-aeab-4533-9be8-2b84092d7b30-kid3.jpg

తల్లిదండ్రులు  మెచ్చుకుంటే పిల్లలు మరిన్ని విజయాలవైపు ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారు.

47ec4bb7-f4e0-4766-802f-566f1b31ee16-kid6.jpg

పిల్లలు అడిగే దేన్నీ వద్దు అని చెప్పకూడదు. దానికి బదులు వారు అడుగుతున్నదాని వెనుక కారణాలు, ఎదురయ్యే పరిస్థితులు వివరిస్తే పిల్లలు ఆలోచిస్తారు.

4c1db90a-bd9f-4440-b463-04f9c37acfd5-kid7.jpg

కష్టం గురించి పిల్లలకు కథలుగా చెబుతుండాలి.  తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఇల్లు గడుస్తోందో తెలిస్తే పిల్లలు అన్ని విషయాల్లో బాధ్యతగా ఉంటారు.