తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలలో పెంచాల్సిన 8 అలవాట్లు ఇవీ..!
పాజిటివ్ గా ఉండటం నేర్పాలి. ఈ అలవాటు పిల్లల మంచి వ్యక్తిత్వానికి మొదటి మెట్టు అవుతుంది.
పిల్లలు ఏది గమనించినా, ఏది చెప్పినా అది నేర్చుకుంటారు. అందుకే చిన్నతనం నుండే వారికి మంచి విషయాలు చెబుతుండాలి.
జీవితం గొప్పదనాన్ని వివరించాలి. ప్రపంచంలో ఎంతోమంది పిల్లలకు కనీసం ఇలాంటి సౌకర్యాలు, రక్షణ లేవని వివరించాలి. దీనివల్ల వారికి జీవితం విలువ అర్థమవుతుంది.
పిల్లలకు ఒదిగి ఉండటం నేర్పాలి. దీనివల్ల వారు అహంకారానికి దూరంగా ఉంటారు. ఇతరుల బాధలను విని అర్థం చేసుకోగలుగుతారు.
జీవితంలో సంతృప్తిగా ఉండటాన్ని పిల్లలకు నేర్పాలి. ఇలా చేస్తే తమ దగ్గరున్న దాంతో పిల్లలు సంతృప్తి పడతారు.
ఇతరులతో పోలిక సరికాదని చెప్పాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఇతరులతో పోల్చి తిట్టకూడదు. ఇలా చేస్తే పిల్లలు ఇతరులతో పోల్చుకుని ఒత్తిడికి గురికారు.
కథలు, గొప్ప వ్యక్తుల జీవితాలు, కష్టపడి పైకి వచ్చిన వారి సంగతులు పిల్లలకు చెబుతూ ఉండాలి. ఇవన్నీ పిల్లలలో నైతిక విలువలు పెంచుతాయి.