పిల్లలకు 10ఏళ్ల వయసొచ్చేలోపు ఈ 10 విషయాలు నేర్పించాలి.
షూ లేస్ లు కట్టుకోవడం, షర్ట్ బటన్స్ పెట్టుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా నేర్పించాలి. వీటివల్ల పిల్లలు పనిచేయడాన్ని నేర్చుకుంటారు.
పెద్దల పట్ల గౌరవంతోనూ, తోటి విద్యార్థులతో స్నేహంగానూ, పేదవారి పట్ల దయతోనూ ఉండటం నేర్పించాలి. ఇవి పిల్లలో విలువలు పెంచుతాయి.
తమ పనులు తాము చేసుకోవడం ఇంట్లో మొక్కలు, పెంపుడు జంతువులను చూసుకోవడం నేర్పించాలి. వీటి వల్ల అప్పగించిన పనులను బాధ్యతగా చేయడం నేర్చుకుంటారు.
సమస్య వచ్చినప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? ఎలా ఆలోచిస్తావు అని పిల్లలను ప్రోత్సహించాలి, చర్చించాలి. దీనివల్ల అన్ని కోణాలలో ఆలోచించడం నేర్చుకుంటారు.
పాకెట్ మనీ పొదుపు చేసుకోవడం వారి పొదుపుతో వారికి నచ్చిన వస్తువులు కొనుక్కోవడం, ఇతరులకు సహాయం చేయడం నేర్పించాలి. దీనివల్ల డబ్బు విలువ అర్థం అవుతుంది.
సమయానికి తిండి, నిద్ర, వ్యాయామం ఫాలో అయ్యేలా అలవాటు చేయాలి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇతరుల భావోద్వేగాలను గుర్తించడం వాటికి తగ్గట్టు స్పందించడం నేర్పించాలి. పిల్లలు కూడా తమ భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు.
పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండటం, రీసైక్లింగ్, ఆర్ట్ క్రాఫ్ట్స్ వంటివి నేర్పించాలి. పిల్లలలో కళలు పెంపొందడమే కాదు ప్రకృతి పట్ల బాధ్యతగా కూడా ఉంటారు.
సోషల్ మీడియా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు అనవసరైన విషయాలను సెర్చ్ చేయకూడదని అర్థమయ్యేలా చెప్పాలి. ఇంటర్నెట్ కు ఒక హద్దు విధించాలి.
ప్రస్తుత కాలాన్ని సంతోషంగా గడిపేలా చెయ్యాలి. చిన్నతనంలోనే భవిష్యత్తు గురించి పిల్లలలో ఆలోచన రేకెత్తించకూడదు.