ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆరోగ్యకరమైన దినచర్య ఏంటంటే.. 

ప్రతిరోజూ ఉదయం 3  నుంచి 6 గంటల లోపు నిద్ర లేవాలి. ప్రకృతిలోని సహజశక్తితో ఏకీకృతమయ్యేందుకు ఇదే తగిన సమయం

నిద్ర లేవగానే ముందుగా బ్రష్ చేసుకోవాలి. నాలిక గీసుకోవడం, ఆయిల్ పుల్లింగ్‌తో విషతుల్యాలను వదిలించుకోవాలి

గోరువెచ్చని నూనెతో ఎవరికి వారు మసాజ్ (అభ్యంగనం) చేసుకుంటే కండరాలు రిలాక్స్ అయ్యి రక్తప్రసరణ మెరుగవుతుంది

ఒంట్లో ఫ్లెక్సిబిలిటీని పెంచేందుకు యోగా లేదా కసరత్తులు చేయాలి. మన శరీరతత్వం, ఆరోగ్యానికి అనుగుణంగా కసరత్తులు ఉండాలి

ఒత్తిడి, ప్రతికూలతలు తగ్గించుకుని స్పష్టత పెంపొందించేందుకు ప్రాణాయామం, ధ్యానం చేయాలి

పోషకాలు పుష్కలంగా ఉన్న రుచికరమైన అల్పాహారాన్ని ఉదయాన్నే కచ్చితంగా తినాలి

ఆ రోజు చేయబోయే పనుల గురించి ఉదయాన్నే ప్రణాళికలు వేసుకుంటే ఉత్పాదక మెరుగై వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లో సంతృప్తి లభిస్తుంది. 

మధ్యాహ్నం చిన్న కునుకు తీయాలి. దీని వల్ల కోల్పోయిన శక్తి తిరిగి లభించి శరీరం పునరుత్తేజితమవుతుంది.

రాత్రి భోజనం పరిమితంగా ఉండాలి. సులువగా జీర్ణమయ్యే ఆహారాన్నే రాత్రిళ్లు తినాలి. 

అర్ధరాత్రి దాకా మేల్కోకుండా త్వరగా పడుకోవడం కూడా ముఖ్యమేనని ఆయుర్వేదం చెబుతోంది.