కనులపండువగా..  పూరీ జగన్నాథుడి రథోత్సవం

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కనులపండువగా జరుగుతోంది. ఒడిశాతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పూరీ ఆలయానికి తరలివస్తున్నారు. 

జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ విధులన్నీ మార్మోగుతున్నాయి. 

ఆదివారం తెల్లవారుజామున రత్నసింహాసనంపై చతుర్థామూర్తులు కొలువు దీరారు. అనంతరం జగన్నాథుడిని అలంకరించారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాల వల్లభ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. 

మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై చెరాపహరా చేశారు. సాయంత్రం 4 గంటలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టి 5 గంటలకు బలభధ్రుని తాళధ్వజ రథం లాగారు. 

రాష్ట్రపతులెవరూ ఇప్పటి వరకు రాలేదు. తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 

రథోత్సవం సందర్భంగా మహిళా కళాకారులు చేసిన నృత్యం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.