అటుకులు vs ఓట్స్: రెండింటిలో ఏది ఎప్పుడు తింటే మంచిది!
అటుకులతో చేసే టిఫిన్ అయిన పోహా చాలా పోషకాలను అందిస్తుంది. బియ్యం నుంచే వచ్చే అటుకుల్లో చాలా పోషకాలు ఉంటాయి.
ఒక ప్లేట్ పోహాలో 28-30 గ్రాముల ప్రోటీన్, 130-150 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల వరకు కొవ్వు, కొద్ది మోతాదులో ఫైబర్ ఉంటుంది.
పోహా చాలా తేలికైన, తక్కువ క్యాలరీలు కలిగిన అల్పాహారం. ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్న వారు పోహాను తీసుకోవాలి.
చాలా సులభంగా జీర్ణమయ్యే పోహాను ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకోవడం ఉత్తమం.
శరీరానికి ఫైబర్ అందించాలంటే ఓట్స్‌ను మించింది మరొకటి లేదు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, కొలస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది.
ఓట్స్‌లో ఫైబర్‌తో పాటు యాంటీ-ఆక్సిడెంట్లు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్న వారికి ఓట్స్ మంచి ఆహారం.
బరువు తగ్గాలనుకునే వారు రాత్రి వేళల్లో ఓట్స్ తీసుకుంటే మంచిది. రాత్రి భోజనంలో ఓట్స్ తింటే మేలు జరుగుతుంది.
Related Web Stories
ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా
టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!
ప్రతిరోజూ సూర్య నమస్కారాలు వేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?