పరీక్షల కారణంగా పిల్లలలో ఒత్తిడి ఉండకూదంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
కొత్త ఏడాదితో పాటు పరీక్షల హడావిడి మొదలవుతుంది. పిల్లలు మామూలుకంటే ఎక్కువగా చదవడం వల్ల ఒత్తిడిగా ఫీలవుతుంటారు. వారి ఒత్తిడిని పోగొట్టడానికి తల్లిదండ్రులు ఈ పనులు చెయ్యాలి.
తల్లిదండ్రులు పిల్లలతో ఓపెన్ గా మాట్లాడటం ఎంతో ముఖ్యం. ఇది వారిలో భయాన్ని పోగొడుతుంది. ఏదైనా తల్లిదండ్రులకు చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది.
పిల్లలు టైం టేబుల్ ఫాలో అయ్యేలా చూడాలి. ఏ టైం కు ఏమి చదవాలో ఫిక్స్ చేసుకుంటే సిలబస్ కవర్ చెయ్యడం సులువు అవుతుంది.
పిల్లలు బాగా చదవాలన్నా, చదివింది గుర్తుపెట్టుకోవాలన్నా మంచి నిద్ర అవసరం. పరీక్షలు అయిపోయే వరకే కదా అని నైటౌట్ లు ఎంకరేజ్ చేయకూడదు.
ముఖ్యమైన పాయింట్లను ఒకవైపు, సందేహాలను మరొకవైపు నోట్ చేసుకుంటే పరిష్కరించుకోవడం, తిరిగి రివిజన్ చేసుకోవడం సులువు అవుతుంది.
ఆరోగ్యకమైన ఆహారం తీసుకునేలా చూడాలి. మెదడుకు పదును పెట్టే ఆహారాలు, ఏకాగ్రత పెరగడానికి ఆసనాలు, లోతైన శ్వాస వ్యాయామాలు. ధ్యానం చేయించాలి.
పిల్లలు ఆడుకోకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతారు. అందుకే మెదడుకు పదును పెట్టే పజిల్స్, గేమ్స్ ను ఎంకరేజ్ చెయ్యాలి.
పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. పెద్దలు తమ పనులను క్రమశిక్షణతో పూర్తీ చేస్తే పిల్లలు కూడా క్రమశిక్షగా అన్ని పనులు చేసుకుంటారు.
పరీక్షా ఫలితాల గురించి ముందుగానే వార్నింగ్ ఇవ్వడం, భయపెట్టడం చేయకూడదు.