మల్టిగ్రెయిన్ ఇడ్లీ.. ఇలా తయారు చేసుకుంటే ఎంత ఆరోగ్యమో..
ఇడ్లీ ఆరోగ్యకరమైన ఆహారం. చిన్న పిల్లలకు, జబ్బు చేసిన వారికి కూడా ఇడ్లీ తినమని వైద్యులు చెబుతుంటారు.
ఇడ్లీ వల్ల శరీరానికి మరింత ఆరోగ్యం పెరగాలంటే.. మల్టిగ్రెయిన్ ఇడ్లీ తయారు చేసుకుని తినాలి.
జొన్న పిండి, గోధుమ పిండి, రాగి పిండి, సద్ద పిండిలతో మల్టిగ్రెయిన్ ఇడ్లీ తయారు చేస్తారు.
కావలసిన పదార్థాలు..
1/2 కప్పు రాగి పిండి
1/2 కప్పు సద్ద పిండి
1/2 కప్పు జొన్న పిండి
1/2 కప్పు గోధుమ పిండి
1/2 కప్పు మినపప్పు
2స్పూన్ల మెంతులు
1 స్పూన్ ఉప్పు
నూనె.. కావలసినంత.
మినపప్పు, మెంతి గింజలను నాలుగు నుండి 5 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో తగినంత నీరు జోడించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక పెద్ద గిన్నెలో మినపపిండి పోసి అందులో ముందుగానే తీసుకున్న పిండులు అన్నీ వేసి బాగా కలపాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచాలి.
ఉదయాన్నే పిండిని బాగా కలిపి తగినంత ఉప్పు జోడించి ఇడ్లీ పాత్రలలో సాధారణ ఇడ్లీలలానే పెట్టుకోవాలి.
15 నిమిషాలు ఆవిరి మీద ఉడికిన తరువాత చెట్నీ లేదా సాంబార్ తో తినడానికి మల్టిగ్రెయిన్ ఇడ్లీలు సిద్దమైనట్టే.
Related Web Stories
శరీరంపై పచ్చబొట్టు ఉంటే రక్తదానం చేయకూడదా
సాక్స్‌లు ధరించకుండా షూ వేస్తున్నారా..?
బొప్పాయితో పాటు వీటిని అస్సలు తినకండి..
ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు..!