6b0d4684-fb1b-4e22-bd9a-418a6a14d67c-kitchen.jpg

ఈ సూపర్ ఫుడ్స్‌ను ఇంటి దగ్గరే చేసుకోండి.. కొలస్ట్రాల్, షుగర్ పరార్!

10bc0b9f-b810-4555-a57f-4baf9cde406c-roti.jpg

బరువు తగ్గేందుకు, షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచేందుకు చాలా మంది చపాతీలు తింటూ ఉంటారు. అయితే గోధుమ పిండి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.

7c2e9fd9-33df-4ab9-a5a9-9e4caecdceb1-millets.jpg

గోధుమ పిండికి బదులుగా మిల్లెట్ మిశ్రమాలను వాడడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

61bf7856-61f6-4011-8fdf-83fdcb14a299-pearl.jpg

పెరల్ మిల్లెట్స్ అని పిలిచే సజ్జల పిండి చాలా ఆరోగ్యకరమైనది. సజ్జల్లో మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని డయాబెటీస్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటారు. కొలస్ట్రాల్ స్థాయులను, రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది.

89f96bf2-e297-42a5-99bb-917407c8f352-foxtaal.jpg

కొర్రల్లో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియంతో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది. వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

0b4905b9-3c9b-4543-aef5-88f7911dc564-sourgum.jpg

అధిక రక్త పోటు, మధుమేహం ఉన్న వాళ్ళకి జొన్నలు మంచి ఆహారం. ఇతర ధాన్యాల కంటే కూడా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. ఐరన్, కాపర్ కూడా ఇందులో ఉంటాయి. దీంతో బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది.

1ed45533-b718-4985-b359-ac221e4ed0bf-barnyard.jpg

ఊదలు ఫైబర్, ప్రోటీన్, ఇనుము, కాల్షియం వంటి అవసరమైన పోషకాల పవర్‌హౌస్. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

536cb468-089d-40b7-b179-bb3ca8d38bba-ragi.jpg

డయాబెటిక్ రోగులు ఉదయం, మధ్యాహ్నం భోజనంలో రాగులను చేర్చితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలో కొవ్వుల శాతం చాలా తక్కువగా ఉంటుంది.

6e58a7eb-c4d1-4176-bfb2-e72fc0461076-flour.jpg

మిల్లెట్స్ కొనుగోలు చేసి పిండిగా చేసుకుని విడివిడిగా రోటీలు చేసుకున్నా, లేదా అన్నింటి మిశ్రమాలతో రోటీ చేసుకున్నా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.