భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు,  పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఈడీ వెంకట దత్తసాయి ఒక్కటయ్యారు

ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్‌ సరస్సులో ఒక దీవి వేదికగా సింధు వివాహం జరిగింది

రాత్రి 11.20 గంటల సమయంలో సింధు మెడలో దత్త మూడు ముళ్లు వేశాడు

సుమారు 140 మంది ముఖ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది

ఈ వేడుకలో తెలుగుదనంతో పాటు రాజస్థాన్‌ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు

ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవిలో రఫల్స్‌ సంస్థ రిసార్ట్‌ను నిర్మించింది

అతిథులను ప్రత్యేక పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు

ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్‌, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌,

ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు

హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్‌ జరగనుంది