బాదం గింజల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. నానబెట్టినపుడు ఆ ఫైటిక్ యాసిడ్ విచ్ఛిన్నం అవుతుంది. ఫలితంగా బాదం గింజల్లోని పోషకాలు సులభంగా జీర్ణమవుతాయి.
నానబెట్టడం వల్ల బాదం గింజల్లోని భాస్వరం, కాల్షియం వంటి కొన్ని ఖనిజాలు మీ శరీరం గ్రహించడానికి అనువుగా మారతాయి.
ముడి, నానబెట్టిన బాదం గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్లు దాదాపు సమానంగానే ఉంటాయి. అయితే నానబెట్టడం వల్ల యాంటీ-ఆక్సిడెంట్లు మరింత చురుగ్గా పని చేస్తాయి.
ముడి బాదంతో పోలిస్తే నానబెట్టిన బాదం గింజల్లో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో కొలస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తాయి.
నానబెట్టిన బాదం గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి.
నానబెట్టిన బాదంలో ఉండే ఎంజైమ్ కొన్ని ఇన్హిబిటర్లను తటస్థం చేస్తుంది. ఈ నిరోధకాలు పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి.
బాదం గింజల్లో ఉండే కొన్ని ముడి పదార్థాలను, ప్లాంట్ ప్రోటీన్లను శరీరం సులభంగా గ్రహించుకోవాలంటే కచ్చితంగా వాటిని నానబెట్టుకుని తినడం ఉత్తమం.
జుట్టు సంరక్షణకు, పెరుగుదలకు బాదం తినడం చాలా మేలు చేస్తుంది. నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్-ఈని శరీరం సులభంగా శోషణం చేసుకుంటుంది.
నానబెట్టిన బాదం గింజలు తినడానికి మృదువుగా, కాస్త రుచిగా అనిపిస్తాయి. నానబెట్టిన బాదం గింజలు సులభంగా జీర్ణమవుతాయి.