పచ్చివి vs ఉడికించినవి:
మొలకలు ఎలా తింటే మంచిది!
మొలకలు ఎన్నో పోషకాలకు, ప్రోటీన్లకు స్టోర్ హౌస్ లాంటివి. వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది.
పచ్చి మొలకలు తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇవి సరైన ఎంపిక.
ఉడకబెట్టిన మొలకలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు ఉడకబెట్టినవి తినడం ఉత్తమం.
పచ్చి మొలకలు ఎంజైమ్లు, విటమిన్లు, ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
మొలకలను ఉడకబెట్టడం వల్ల వాటిల్లోని కొన్ని పోషకాలు కచ్చితంగా దూరమవుతాయి. వేడి చేయడం మొలకల్లోని కొన్ని సెన్సిటివ్ పోషకాలను నాశనం చేస్తుంది.
పచ్చి మొలకల్లో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంది. ఉడికించడం వల్ల ఆ బ్యాక్టీరియా నాశనం అయి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం దూరమవుతుంది.
పచ్చి మొలకల్లోని కొన్ని పోషకాలు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. ఉడికించడం వల్ల కొంత వరకు వాటిని నష్టపోయే ప్రమాదం ఉంది.
పచ్చి మొలకలు తినడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ఉడకబెట్టి తినడం వల్ల మరికొన్ని ప్రయోజనాలున్నాయి. మీ శారీరక పరిస్థితిని బట్టి వాటిని తీసుకోవడం ఉత్తమం.
Related Web Stories
అంతరించిపోతోన్న.. ఆ 6 బంగ్లాదేశ్ జంతువులు ఇవే..
మీ పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే.. ఈ నియమాలు పాటించండి..!
ఈ వేసవిలో నేరేడు పళ్లు తినండి.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..!
ఐస్ క్రీమ్ తినడం మంచిదేనా..సర్వేలు ఏం చెబుతున్నాయ్