చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి స్ట్రోక్‌ను నిరోధించే ఎర్రటి రసాలివే..!

పండ్ల రసాలు మంచి పోషకాలను, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. 

దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును, ఎల్‌డిఎల్ స్థాయిలను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. 

క్రాన్ బెర్రీ జ్యూస్ గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.

టమాటా జ్యూస్‌లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. 

బీట్ రూట్ జ్యూస్‌లో నైట్రేట్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. 

చెర్రీజ్యూస్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె ఆఱోగ్యాన్ని కాపాడతాయి. 

రెడ్ గ్రేప్ జ్యూస్‌లో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.