అన్నం vs చపాతీ:  రాత్రివేళ ఏది తింటే మంచిది?

అన్నంతో పోల్చుకుంటే చపాతీలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. 

తెల్లన్నంతో పోల్చుకుంటే చపాతీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహార పదార్థం. చపాతీ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. 

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల చపాతీ తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. 

చపాతీ ఎన్ని తింటున్నామనే లెక్క సులభంగా తెలుస్తుంది. అన్నం విషయంలో అది కొంచెం కష్టం అవుతుంది. 

కొందరికి గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది. అలాంటి వారు చపాతీలకు దూరంగా ఉండాలి. వారికి బ్రౌన్ రైస్ మంచి ఆప్షన్. 

రాత్రి వేళ చపాతీలతో పోల్చుకుంటే అన్నం త్వరగా అరుగుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు.

బ్రౌన్ రైస్ తినడం వల్ల బి-విటమిన్లు పుష్కలంగా అందుతాయి. తగు మోతాదులో ఫైబర్ కూడా ఉంటుంది. 

తక్కువ అన్నంలో ఎక్కువ కూర కలుపుకుని తినడం చాలా ఉత్తమం. 

తెల్లన్నంతో పోల్చుకుంటే చపాతీ తినడమే ఉత్తమం. కానీ, గ్లూటెన్ పడకపోతే బ్రౌన్ రైస్ తీసుకోవడం మంచిది.