చపాతీ vs అన్నం: రెండింటిలో ఏది తినడం మంచిది? 

బరువు తగ్గేందుకు చాలా మంది చపాతీలను తింటూ ఉంటారు. అన్నం తగ్గించి చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అంటారు. మరి, అన్నం, చపాతీల్లో ఏది తింటే మంచిదో చూద్దాం.. 

అన్నంతో పోల్చుకుంటే చపాతీల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకునే వారికి చపాతీ మంచి ఆప్షన్. 

తృణ ధాన్యాలతో చేసిన రోటీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

గోధుమ పిండితో చేసిన రోటీల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే రక్తంలో కలిసి పోకుండా బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. 

చపాతీలతో పోల్చుకుంటే అన్నంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. గుండె సమస్యలున్న వారు చపాతీల కంటే అన్నం తినడం ఉత్తమం. 

చపాతీలతో పోల్చుకుంటే అన్నం చాలా త్వరగా జీర్ణమవుతుంది. చాలా మందికి చపాతీల్లోని గ్లూటెన్ సరిగ్గా అరగక జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. 

తక్కువ అన్నంలో ఎక్కువ కూరలు కలుపుకుని తినడం వల్ల విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల ఆహారం తిన్నట్టు ఉంటుంది. 

చపాతీలతో పోల్చుకుంటే అన్నంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా త్వరగా కడుపు నిండినట్టు అనిపించదు. కాబట్టి ఎక్కువ తినేసే ప్రమాదం ఉంటుంది. 

చపాతీలు తినలేని వారు, జీర్ణ సమస్యతో బాధపడుతున్న వారు తక్కువ పాలిష్ పెట్టిన అన్నం తక్కువ మోతాదులో తినడం ఉత్తమం.