స్టవ్‌పై పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కడిగిన రెడ్ రైస్ వేసి ఐదు నిమిషాలు దోరగా వేయించాలి. ఆపై మూడు కప్పుల నీళ్లు పోయాలి.
అన్నం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా చూసుకోవాలి.
ఆపై స్టవ్‌పై మరో గిన్నె పెట్టి ముప్పావు కప్పు నీళ్లు పోసి అందులో 3 కప్పులు సన్నగా తరిగిన తాటి బెల్లం వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బెల్లాన్ని కరగబెట్టాలి. బెల్లం పాకం రానవసరం లేదు..
ఇప్పుడు ఉడికిన బియ్యాన్ని బెల్లం నీళ్లలో వేసి.. మంటను తక్కువగా పెట్టి తరచూ కలుపుతూ ఉండాలి
ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నల్ల ఎండు ద్రాక్ష వేసి కలపాలి. ఆపై నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి.
20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో.. 1 టీ స్పూన్ శొంటి పొడి, 1 టీ స్పూన్ యాలకల పొడి, చిటికెడంత పచ్చి కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి.
అనంతరం 15 నిమిషాల తర్వాత చిక్కగా తీగ పాకం వచ్చాక స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరంగా ఉండే శబరిమల అయ్యప్పప్రసాదం రెడీ.