పిల్లలు ఇప్పుడు వద్దనుకునే వారికి షాకింగ్ న్యూస్!

పెళ్లైన తర్వాత సంతానం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు

కొందరికి ఆరోగ్యపరమైన ఉండగా, మరికొంత మంది సెటిల్ కాలేదని వాయిదా వేస్తారు

కారణాలేదైనా ఆలస్యంగా గర్భం దాలిస్తే స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

40 ఏళ్ల తర్వాత గర్భధారణ వస్తే డెలివరీ సమయంలో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు

35 ఏళ్ల తర్వాత మహిళల్లో సంతానానికి దోహదం చేసే అండాల పరిమాణం, నాణ్యత తగ్గుతుందన్నారు

వయస్సు పెరిగే కొద్దీ ఎండో మెట్రియోసిస్, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యలు మహిళల్లో పెరుగుతాయని అంటున్నారు

గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు డయాబెటిస్ వస్తుందని కూడా చెబుతున్నారు

లేటు వయస్సు ప్రెగ్నెన్సీ కారణంగా ఫీటల్ మాక్రోసోమియా ప్రాబ్లం పెరుగుతుందన్నారు

అంటే పుట్టబోయే పిల్లలు చాలా తక్కువ బరువుతో కానీ లేదా అధిక బరువుతో కానీ పుట్టే అవకాశం ఉందన్నారు

అందుకే దంపతులు 35 ఏళ్లలోపే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు