మీ RO ఎంత విద్యుత్ వినియోగిస్తుందో మీకు తెలుసా?

 నేటికాలంలో స్వచ్చమైన నీటికోసం ప్రతి ఇంట్లో వాటర్ ఫ్యూరిఫైయర్లు వినియోగిస్తున్నారు.

RO వాటర్ ను కేవలం తాగడానికి  మాత్రమే కాకుండా చాలామంది ఇంట్లో వంట చేయడానికి  కూడా వినియోగిస్తుంటారు. దీని కారణంగా  వాటర్ ఫ్యూరిపైయర్ పనిచేస్తూనే ఉంటుంది.

సాధారణంగా వాటర్ ఫ్యూరిఫైయర్ గంటకు 60 నుండి 120 వాట్ల విద్యుత్ ను వినియోగిస్తుంది.

వాటర్ ఫ్యూరిపైయర్ UV అయితే అది తక్కువ విద్యుత్ ను అంటే 30 నుండి 40 వాట్ల విద్యుత్ ను వినియోగిస్తుంది.

ఒక యూనిట్ లో 1000 వాట్లు ఉంటాయి. RO సిస్టమ్ రోజంతా పనిచేస్తుంటే రోజుకు 2 నుండి 3 యూనిట్ల విద్యుత్ వినియోగించుకుంటుంది.

UV సిస్టమ్  రోజంతా పనిచేస్తుంటే  అది 1 నుండి 2 యూనిట్ల విద్యుత్ వినియోగించుకుంటుంది.

వాటర్ ఫ్యూరిఫైయర్లు ఎక్కువ విద్యుత్ వినియోగించుకోకూడదంటే నీటిని నిల్వ చేసుకోగానే దాన్ని ఆఫ్ చేయాలి.