టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!

టీతో పాటూ ఏదో ఒకటి తినడం కొందరికి అలవాటు.  

కరకరలాడే రస్క్ ను వేడి వేడి టీ లో ముంచుకుని తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు.

రస్క్ తయారీలో మైదా, పామాయిల్,  పంచదార వంటి అనారోగ్యకరమైన పదార్థాలను ఉపయోగిస్తారు.

తయారు చేసిన బ్రెడ్ ను తిరిగి బేక్ చేయడం వల్ల ఇవి చాలా ప్రాసెస్ చేయబడిన ఆహారం కోవలోకి వస్తాయి.

టీతో రస్క్ లు తినడం  వల్ల అవి జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

రస్క్ తయారీలో పంచదార, సోడియం ఎక్కువ మొత్తంలో వాడతారు.  దీనివల్ల మధుమేహం, రక్తపోటు తొందరగా వస్తాయి.

గ్యాస్, ఉబ్బరం,  జీర్ణ సంబంధ సమస్యలు రస్క్ లు దీర్ఘకాలం తినడం వల్ల వస్తాయి.

ముఖ్యంగా చిన్న పిల్లలకు పాలతో రస్క్ ఇవ్వడం అస్సలు మంచిది కాదు.