అధిక ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్ అనారోగ్యానికి దారి తీస్తుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కారణంగా రక్తప్రసరణ తగ్గుతుంది.
ఇలా రక్తప్రసరణ తగ్గితే కాళ్లల్లో, పాదాల్లో సమస్యలు వస్తాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
కాళ్లల్లో నాడి బలహీనంగా కొట్టుకున్నట్టు ఉండటం, గుర్తుపట్టలేనంత తక్కువగా ఉండటం కొలెస్టెరాల్ పెరిగిందనేందుకు ఓ సంకేతం
కాళ్లు, పాదాల్లో నొప్పులు, పట్టేసినట్టు ఉండటం, పోటు లాగా రావడం కూడా కొలెస్టెరాల్ పెరుగుదలకు సూచనలు
కాళ్లల్లో స్పర్శ తగ్గినట్టు ఉండటం, సులువుగా కాళ్లను కదపలేకపోవడం కూడా ఓ ప్రమాదకర సూచనే
అరికాళ్లు తరచూ చల్లబడుతున్నట్టు ఉన్నా అనుమానించాల్సిందే. రక్తప్రసరణ తగ్గినప్పుడు ఇలా అనిపిస్తుందట.
రక్తప్రసరణ తగ్గడంతో గాయాలు కూడా త్వరగా మానవు. ఇలాంటి పరిస్థితి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కాళ్లు లేత నీలి రంగు, లేదా ఎర్రగా మారుతున్నాయంటే రక్తప్రసరణలో లోపాలు ఉన్నట్టు అనుమానించాలి.
కాళ్లపైపొరల్లో అధిక కొలెస్టెరాల్ కారణంగా వెంట్రుకలు ఊడిపోతాయి. కాబట్టి, ఇలాంటి పరిస్థితి అధిక కొలెస్టెరాల్ సంకేతంగా భావించాలి
Related Web Stories
Weight Loss: ఈ సమయాల్లో మీ బరువు చూసుకోకండి..
జీవితాన్ని అందంగా మార్చే 8 అలవాట్లు ఇవీ..!
భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏయే దేశాల్లో వాహనాలు నడపొచ్చంటే..
మీ కారుకు సీటు బెల్ట్ ఉందా?