కంటి చుట్టూ నల్లటి వలయాలను తగ్గించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
రక్తనాళాల వాపు తగ్గించడానికి 10 నుంచి 15 నిమిషాలు దోసకాయల ముక్కలను కంటి చూట్టూ పేర్చండి.
దోసముక్కలు కంటి చూట్టూ ఉంచడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
రక్త ప్రసరణను ఉత్తేజపరిచేందుకు, నల్లటి వలయాలను తగ్గించడానికి 10 నుంచి 15 నిమిషాలు పాటు గ్రీన్ లేదా బ్లాక్ టీ బ్యాగ్స్ కళ్ళపై ఉంచాలి.
నిద్రవేళకు ముందు కళ్ల కింద కొన్ని చుక్కల బాదం నూనెను సున్నితంగా మసాజ్ చేయండి ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.
రోజ్ వాటర్‌లో కాటన్ ముంచి కళ్లపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఉబ్బిన నరాలను నార్మల్ చేస్తుంది.
టమాటా రసం, నిమ్మరసం రెండూ నల్లటి వలయాలను తగ్గిస్తాయి. 10 నిమిషాలు వదిలి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఇది ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
పచ్చి బంగాళా దుంప ముక్కలను కళ్లపై 10 నుంచి 15 నిమిషాలు ఉంచినా సరే లేదంటే బంగాళా దుంప రసంలో కాటన్ ముంచి దానిని వలయాల చుట్టూ రాసినా కాంతివంతంగా మారుతుంది.
నిద్రవేళకు ముందు నల్లటి వలయాల చూట్టూ కలబంద జెల్‌ను పూయండి. ఇది మంటను తగ్గిస్తుంది.