నాగచైతన్య-శోభిత పెళ్లిలో..
శోభిత ధరించిన చీర
ఎవరు డిజైన్ చేశారో తెలుసా..
అక్కినేని నాగచైతన్య- శోభితా ధూలిపాళ్ల పెళ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది.
ఈ వేడుకకు అక్కినేని, ధూళిపాళ కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
బంగారు అంచు కాంచీవరం చీరలో శోభిత అచ్చ తెలుగు పెళ్లి కూతురిలా మెరిసిపోయింది.
ఎలాంటి డిజైనర్ సాయం లేకుండానే ఆమె తన దుస్తులను తల్లితో కలిసి నేరుగా ఖరీదు చేసినట్టు తెలుస్తోంది.
సిల్వర్ రంగు చీర.. బంగారు జరీలో అచ్చం దేవకన్యలా కనిపించింది.
డిజైనర్ నగలకు బదులుగా ఆమె తన పెళ్లి రోజు కోసం తన తల్లి, అమ్మమ్మ ధరించిన ఆభరణాలనే వేసుకోవడం విశేషం.
ఇక మేకప్ విషయంలోనూ శోభిత తన ప్రత్యేకతను తెలిపింది.
మినిమల్ బ్రోంజ్ లుక్ తో బేస్‌ను క్రియేట్ చేసి కళ్లను తీర్చిదిద్దేందుకు బంగారు వర్ణం రంగును ఎంచుకున్నారు.
తనకు ఎంతో ఇష్టమైన బోల్డ్ కాజల్ లుక్ తో పాటు మెరుపులు లేని మ్యాటీ లిప్ స్టిక్ షేడ్ తో పెదాలను హైలెట్ చేశారు.
Related Web Stories
నిమిషాల్లో బ్రెడ్ ఆమ్లెట్‌ని సింపుల్‌గా తయారు చేసుకోండిలా..
మీ ఇంట్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం.. రెసిపీ ఇదే
ఇడ్లీలు మృదువుగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ఫాలో కండి .!
ఇంటి ముందు ఈ చెట్లు ఉంటే.. నెగిటివ్ వైబ్రేషన్స్ పరార్..!