సౌత్ ఇండియన్ దాల్ వడ..  ఇంట్లోనే తయారు చేయడం ఎలా..

ముందుగా ఒక కప్పు చనా పప్పును.. మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి.

తరువాత నానబెట్టిన పప్పును మళ్లి కడిగి, వడకట్టి మరో 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలు, అల్లం, కరివేపాకులను మెత్తగా కోయాలి.

ఇప్పుడు ఆకుకూరల మిశ్రమాన్ని, నానబెట్టిన పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమంలో ఉప్పు, కారం వేసి మళ్లీ కలుపుకోవాలి.

 తరువాత స్టవ్‌పై కడాయి పెట్టుకుని నూనె పోసుకుని బాగా వేడెక్కాక. నిమ్మకాయ పరిమాణంలో మిశ్రమాన్ని తీసుకుని అరచేతుల మధ్య చదును చేసుకోని.

వేడి నూనెలో ఈ వడల్ని ముదురు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే సౌత్ ఇండియన్ దాల్ వడ రెడీ.