ప్రతి ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు

ఈ నేపథ్యంలో చేసుకునే ప్రత్యేక వంటకాల గురించి ఇప్పుడు చుద్దాం

గుజియా: చపాతీ చేసి దాంట్లో కోవా, డ్రై ఫ్రూట్స్ తో మిశ్రమంతో నింపి కజ్జికాయల్లా చుట్టి తయారు చేస్తారు

మాల్పువా: పూరీలాంటి వంటకం. నేతిలో వేయించి, చక్కెర పాకంలో ముంచి చేసే పూరీ ఇది

తండై: ఇది హోలీ పండుగ వేడుకలతో దగ్గరి సంబంధం ఉన్న రిఫ్రెష్ డ్రింక్. ఇది పాలు, చక్కెర, యాలకులు, సోపు, మిరియాలతో తయారు చేస్తారు

పాప్రీ చాట్: ఉడకబెట్టిన బంగాళాదుంపలు, చిక్‌పీస్, పెరుగు, చింతపండు చట్నీతో తయారు చేస్తారు. ఇది తీపి, పులుపు, కారం రుచులను కల్గి ఉంటుంది.

భాంగ్: ఇది పాలు, చక్కెర, సుగంధ ద్రవ్యాలతోపాటు గంజాయి ఆకులను కలపడం ద్వారా తయారు చేస్తారు. ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

కచోరి: మసాలా, బంగాళదుంపలు లేదా బఠానీలతో నింపబడిన రుచికరమైన పేస్ట్రీ. ఇది తరచుగా చట్నీతో వడ్డిస్తారు

బేక్ డ్ నమక్ పారా: దీన్ని మైదా, రవ్వతో చేస్తారు. నమక్ పారాను నూనెలో క్రిస్పీ గా వేయించి తయారు చేస్తారు