భోజనం తర్వాత స్వీట్ తినాలనిపిస్తోందా? ఇలా చేయండి.. 

చాలా మందికి భోజనం చేసిన వెంటనే ఓ స్వీట్ తినాలనిపిస్తుంది. అలా తినడం వల్ల ఒకేసారి చాలా క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. కొన్ని టిప్స్ ఫాలో అయితే భోజనం తర్వాత స్వీట్‌కు దూరంగా ఉండొచ్చు. 

మీరు తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడు కడుపు నిండి స్వీట్ తినాలనిపించదు. 

మీరు కనీసం 20 నిమిషాలు భోజనం ప్లేట్ ముందు కూర్చోవాలి. నెమ్మదిగా నమిలి తినాలి. అప్పుడే కడుపు నిండిన సిగ్నల్ బ్రెయిన్‌కు చేరుతుంది. 

భోజనం తర్వాత వీలైనంత ఎక్కువ నీరు తాగండి. ఫలితంగా కడుపు నిండి స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది. 

భోజనం తర్వాత తప్పనిసరిగా స్వీట్ తినాలనుకుంటే అరటి, యాపిల్, ఆరెంజ్ వంటి పళ్లు తీసుకోండి. 

భోజనం తర్వాత తప్పనిసరిగా స్వీట్ తినాలనే కోరికను అణుచుకోలేకపోతే చాలా కొద్దిగా తినేసి ఆపేయండి. 

భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయడం వల్ల తినే సమయం ముగిసిందని బ్రెయిన్‌కు సిగ్నల్ వెళ్తుంది. 

మీ రోజువారీ పని ఒత్తిడిని తగ్గించుకోండి. స్ట్రెస్ ఎంత ఎక్కువైతే స్వీట్లు తినాలనే కోరిక అంత పెరుగుతుంది. 

రోజులో తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల విడుదల సక్రమంగా జరగదు. ఆకలిని నియంత్రించే హార్మోన్ విడుదల కాకపోతే స్వీట్లు, హై ఫ్యాట్ ఫుడ్స్ తినాలనే కోరిక పెరుగుతుంది.