మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర లేని వేసవి డ్రింక్స్.. !
మధుమేహాం ఉన్నవారు రుచికరమైన రిఫ్రెష్ పానీయాలను తీసుకోవడం అంటే కాస్త కష్టం.
షుగర్ వ్యాధి ఉన్నవారు వేసవి వేడికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. దీనికి చక్కెర లేకుండా వేసవి పానీయాలు ఎంపిక చేసుకోవాలి.
గ్రీన్ టీ అనేక ఆరోగ్యప్రయోజనాల కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన పానీయం.
దోసకాయ పుదీనా డ్రింక్.. తాజా దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మరసం కలిపి చేయాలి.
దోసకాయలలో పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి. వేడి వేసవి రోజులలో ఇది మంచి రిఫ్రెష్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
షుగర్ ఫ్రీ లెమన్.. తాజా నిమ్మరసంలో చక్కెర కాకుండా కాస్త ఉప్పు కలిపి ఈ నీటిని తీసుకుంటే ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నీరు సహజంగా తీపిగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. కొబ్బరి నీరు వేసవి వేడిలో రక్తంలో చక్కెర పెరగకుండా హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహకరిస్తుంది.
బెర్రీ డ్రింక్.. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి పండ్లతో దేనితో మిక్స్ చేసి తీసుకున్నా కూడా మంచి శక్తిని ఇస్తుంది.
పుచ్చకాయ జ్యూస్.. రుచికరమైన హైడ్రేటింగ్ జ్యూస్ ఇది. పుచ్చకాయలో కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.