నేచురల్‌గా గ్రే హెయిర్ రివర్స్ చేసే సూపర్ ఫుడ్స్..

జుట్టు పెరుగుదలకు అనేక పోషకాలు అవసరం. రోజువారి అలవాట్లలో భాగంగా చాలా మార్పులు చేసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. దీనికి

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.

క్యారెట్లలో బిటా రెరోటిన్, విటమిన్ ఎ ఉంటుంది. ఇవి జుట్టు ఆరోగ్యానికి అవసరమైన స్కాల్ఫ్, సహజ నూనెలను అందిస్తుంది. 

ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి జుట్టు రంగు మారడాన్ని తగ్గిస్తాయి.

బెర్రీలు.. బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. హెయిర్ ఫోలికల్స్ హాని కలగకుండా కాపాడుతుంది.

సాల్మన్ ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ తో నిండిన సాల్మన్ స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జుట్టు రంగు మారకుండా చేస్తుంది.

ఆకు కూరలు కాలే, బచ్చలికూర వంటి వాటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి.

వాల్ నట్స్ మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. వాల్ నట్స్ లోని రాగి కంటెంట్ జుట్టు రంగును స్పష్టంగా ఉంచడంలో సహాయపడతాయి.