కాల్షియం లోపంతో శరీరంలో కనిపించే లక్షణాలివే..

శరీర నిర్మాణంలో ఎముకలదే ముఖ్యమైన పాత్ర. ఎముకలు బలంగా, దృఢంగా ఉంటేనే శరీరానికి బలం. 

కాల్షియం లోపం వల్ల దంతాల్లో సమస్యలు తలెత్తవచ్చు. చిగుళ్ల వ్యాధి, దంతక్షయం వంటి ఇబ్బందులు వస్తాయి.

గుండె బలహీనతకు, ప్రాణాంతకమైన వెంట్రిక్యులర్ అరిథ్మియాకు దారితీయవచ్చు. 

చర్మం, వెంట్రుకలు, గోర్లు కాల్షియం లేకపోతే బలనీనంగా మారతాయి. 

అలసట అనేది శరీరానికి కాల్షియం కొరతతో ఏర్పడే ఇబ్బంది. 

కండరాల నొప్పులు, దృఢత్వం కోల్పోవడం కాల్షియం లోపానికి కారణాలు.

తిమ్మిరి, జలదరింపు, నరాల పనితీరు, లోపాలకు కూడా కాల్షియం లోపమే కారణం కావచ్చు.